మహేష్ నుంచి మరో క్లాసిక్ లోడింగ్..?

Published on Apr 30, 2021 3:00 pm IST

మన టాలీవుడ్ లో కొన్ని కాంబినేషన్స్ ఉన్నాయి. ఆ కాంబోస్ నుంచి వచ్చిన సినిమాలు చాలా మట్టుకు ప్రభావం చూపడమో లేక ఎన్నేళ్లు గడిచినా కూడా ఎప్పుడూ ఫ్రెష్ గానే అనిపిస్తాయి. మరి అలాంటి కాంబినేషన్ నే సూపర్ స్టార్ మహేష్ మరియు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కాంబో.

వీరి నుంచి వచ్చింది రెండు సినిమాలే అయినా అవి కలిగించిన ఇంపాక్ట్ ఇప్పటికీ అలానే ఉంది. అందుకే మన టాలీవుడ్ “అతడు” మరియు “ఖలేజా” సినిమాలు క్లాసిక్ జాబితాలో నిలిచాయి. ఖలేజా అయితే ఆ టైం లో వేరే ప్రభావాల వల్ల ఆడలేదు కానీ ఇప్పుడు కూడా సడెన్ గా టీవీలో చూస్తే ఛానల్ మార్చరు.

ఆ రేంజ్ లో ఈ సినిమా ఇప్పటికీ నాటుకుపోయింది. ఇక ఈ కాంబో నుంచి హ్యాట్రిక్ రిపీట్ కానుండడంతో అంచనాలు మరో స్థాయిలో ఉన్నాయి. అయితే ఇప్పుడు రానున్న మూడో సినిమా కూడా మంచి క్లాసిక్ గా నిలవనుందట. త్రివిక్రమ్ ఈ సినిమా స్క్రిప్ట్ చాలా బాగా డిజైన్ చేస్తున్నారని తెలుస్తుంది. మరి ఈ చిత్రం ఎలా ఉండనుందో తెలియాలి అంటే ఇంకొన్నాళ్ళు ఆగాల్సిందే.

సంబంధిత సమాచారం :