చరణ్, శంకర్ ల భారీ ప్రాజెక్ట్ పై క్రేజీ బజ్.!

Published on Jul 17, 2021 10:02 am IST

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు విజనరీ పాన్ ఇండియన్ దర్శకుడు శంకర్ ల కాంబోలో ఒక భారీ ప్రాజెక్ట్ ని ప్లాన్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. జస్ట్ అనౌన్సమెంట్ తోనే అనేక అంచనాలు నెలకొల్పుకున్న ఈ చిత్రం తొందరలోనే షూటింగ్ కూడా స్టార్ట్ చేసుకోనుంది.

అయితే ఈ కాంబోలో ఎలాంటి సినిమా పడుతుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తుండగా పలు ఆసక్తికర అంశాలే ఈ చిత్రంపై వినిపిస్తున్నాయి. అలా లేటెస్ట్ గా మరో ఊహించని క్రేజీ బజ్ ఈ చిత్రంపై వినిపిస్తుంది. ఈ చిత్రంలో చరణ్ డ్యూయల్ రోల్ లో కనిపించనున్నాడని వైరల్ అవుతున్న నయా టాక్.

మెగా వర్గాల నుంచి కూడా ఇదే సమాచారం. ఇప్పటికే ఈ చిత్రం సాలిడ్ పొలిటికల్ డ్రామాగా ఉంటుంది అని అలాగే మళ్ళీ వింటేజ్ శంకర్ ని విట్నెస్ చేసే విధంగా ఉంటుంది అని ఆల్రెడీ ఉన్న టాక్. మరి ఇప్పుడు డ్యూయల్ రోల్ అని కూడా సౌండింగ్ వినిపిస్తుంది. మరి ఇవన్నీ ఎంత మేర నిజమో కాలమే నిర్ణయించాలి.

సంబంధిత సమాచారం :