“వకీల్ సాబ్” టీం నుంచి మరో ఎక్స్ కూజివ్ అప్డేట్..?

Published on Sep 18, 2020 12:01 pm IST

ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం “వకీల్ సాబ్” టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా నిలుస్తుంది. ఈ సినిమాకు వచ్చిన 100 కోట్ల డిజిటల్ ఆఫర్ ను సైతం నిర్మాత దిల్ రాజు పక్కన పెట్టారని అది తీసేసుకుని ఉంటేనే బాగున్ను అని అభిమానుల అభిప్రాయాలతో అలా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.

అయితే ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించి లేటెస్ట్ టాక్ మరొకటి వినిపిస్తుంది. ఇప్పటికే ఎక్స్ క్లూజివ్ గా ఫస్ట్ లుక్ పోస్టర్, ఫస్ట్ సింగిల్ సహా మొన్న పవన్ పుట్టినరోజు సందర్భంగా మోషన్ పోస్టర్ టీజర్ మరియు మరో పోస్టర్ ను అందించిన చిత్ర యూనిట్ సెకండ్ సింగిల్ ను కూడా ప్లాన్ చేయనున్నట్టు తెలుస్తుంది. అయితే ఇంకా టైం ఫిక్స్ అవ్వలేదు కానీ తొందరలోనే ఈ చిత్రం నుంచి రెండో సాంగ్ వచ్చే అవకాశం ఉందని టాక్.

ఇప్పటికే ఈ చిత్రంలో అన్ని సాంగ్స్ ను థమన్ అవుట్ స్టాండింగ్ గా ఇచ్చాడని సినీ వర్గాల్లో చర్చ మొదలయ్యింది. అలాగే ఈ చిత్రం షూట్ కూడా ఈ సెప్టెంబర్ చివరి వారం నుంచే మొదలు కానున్నట్టు కూడా తెలుస్తుంది. అన్ని చక్కగా కుదిరితే ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి రేస్ లో నిలవనుంది.

సంబంధిత సమాచారం :

More