మాస్ మహారాజ్ నుంచి మరో గిఫ్ట్ ఉందా.?

Published on Jan 20, 2021 10:00 am IST

ఈ కొత్త ఏడాది తన సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి సరికొత్త బూస్టప్ ను ఇచ్చిన సాలిడ్ వసూళ్లు అందుకొని లాభాల బాట పట్టించాడు మాస్ మహారాజ్ రవితేజ. గోపీచంద్ మలినేనితో తెరకెక్కించిన చిత్రం “క్రాక్” తో సంక్రాంతి ట్రూ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. మరి అలాగే ఈ సినిమాతో సాలిడ్ కం బ్యాక్ హిట్ అందుకున్న రవితేజ ఇదే కొనసాగించాలని మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ ను లైన్ లో పెట్టేసారు. అదే “ఖిలాడి”, దర్శకుడు రవి వర్మతో ప్లాన్ చేసిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ పై కూడా మంచి అంచనాలు కూడా ఉన్నాయి.

ఇది మాత్రమే కాకుండా రవితేజ మార్క్ లోనే ఫుల్ ఎనర్జిటిక్ గా స్పీడ్ గా కంప్లీట్ చేసేస్తున్నారు. అయితే మరి ఈ కొత్త సంవత్సరం సంక్రాంతి కానుకగా “క్రాక్”తో మంచి గిఫ్ట్ ఇచ్చిన రవితేజ మరి ఇదే జనవరిలో వస్తున్న తన పుట్టినరోజు గిఫ్ట్ కూడా ఇవ్వనున్నట్టుగా గాసిప్స్ వినిపిస్తున్నాయి. ఈ జనవరి 26 తన పుట్టినరోజు సందర్భంగా తన “ఖిలాడి” నుంచి మేకర్స్ గ్లింప్స్ తరహా వీడియోను విడుదల చేస్తారన్నట్టుగా టాక్. మరి ఇప్పటికే చాలా మేర షూట్ పూర్తి కాబడిన ఈ చిత్రం నుంచి మరి ఆ గిఫ్ట్ వస్తుందా లేదా అన్నది చూడాలి.

సంబంధిత సమాచారం :