ఘట్టమనేని కుటుంబం నుండి మరో హీరో !

Published on Oct 25, 2020 7:34 pm IST

ఘట్టమనేని కుటుంబం నుండి సూపర్ స్టార్ కృష్ణ తరువాత ప్రస్తుతం మహేష్ బాబు సూపర్ స్టార్ గా ఓ వెలుగు వెలుగుతున్నాడు. ఇక ఆ తరువాత ఘట్టమనేని కుటుంబం నుండి సుదీర్ బాబు హీరోగా కొనసాగుతున్నాడు. అలాగే గల్లా అశోక్ సైతం హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఇక కృష్ణగారి భార్య విజయ నిర్మల వైపు నుండి కూడా నరేష్ కొన్ని దశాబ్దాలుగా సినిమా రంగంలో ఉన్నారు. నరేష్ కుమారుడు నవీన్ విజయ్ కృష్ణ సైతం హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.

అలాగే మహేష్ సోదరి మంజుల కూడ నటిగా, దర్శకురాలిగా, నిర్మాతగా ప్రతిభ చాటుకోగా ఆమె భర్త సంజయ్ స్వరూప్ సైతం సహాయ నటుడిగా స్థిరపడ్డారు. నిజానికి మహేష్ బాబు కంటే ముందు ఆయన అన్న రమేష్ బాబు హీరోగా వచ్చి అలరించారు. ఇప్పుడు శరన్ అనే మరో కొత్త హీరో కూడా రాబోతున్నాడట. విజయ నిర్మల మనవడే ఈ శరన్. కృష్ణగారికి కూడ మనవడి వరసే అవుతాడు. కాగా రామచంద్ర వట్టికూటి అనే దర్శకుడి చిత్రంతో శరన్ హీరోగా రంగప్రవేశం చేయనున్నాడు.

సంబంధిత సమాచారం :

More