పింక్ రిమేక్ లోకి మరో హీరోయిన్ !

Published on Dec 20, 2018 2:17 am IST

తల అజిత్ బాలీవుడ్ సూపర్ హిట్ ‘పింక్’ రిమేక్ లో నటించనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో ప్రముఖ బాలీవుడ్ నటి విద్యా బాలన్ అతిధి పాత్రలో నటించనుండగా యువ హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శన్ ఒక ముఖ్య పాత్రలో నటించనుందని వార్తలు వచ్చాయి. ఇక ఇప్పుడు తాజాగా ‘రాజా రాణి’ ఫేమ్ నజిరియా నజిమ్ ను కూడా ఒక ముఖ్యమైన పాత్రకు ఎంపిక చేశారని సమాచారం. ‘ధీరన్ అదిగారం ఒండ్రు’ చిత్ర దర్శకుడు హెచ్ వినోత్ తెరకెక్కించనున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరిలో ఈచిత్రం సెట్స్ మీదకు వెళ్లనుంది. బోనీ కపూర్ , జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించనున్న ఈ చిత్రం 2019 మే 1న విడుదలకానుంది. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు.

ఇక 2016 లో విడుదలైన పింక్ విమర్శకుల ప్రశంసలు పొంది జాతీయ అవార్డును సొంతం చేసుకుంది . సోషల్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, తాప్సి పన్ను ముఖ్య పాత్రల్లో నటించారు.

సంబంధిత సమాచారం :