చెర్రీకి శంకర్ పవర్‌ఫుల్ క్యారెక్టరైజేషన్ సెట్ చేశాడా?

Published on Jul 18, 2021 1:07 am IST

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు పాన్ ఇండియన్ దర్శకుడు శంకర్ కాంబోలో దిల్ రాజ్ బ్యానర్‌లో భారీ బడ్జెట్ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. అయితే హై ఎక్స్‌పెక్టెషన్స్ నడుమ రూపుదిద్దుకునే ఈ సినిమాపై భారీగానే అంచనాలు నెలకొంటున్నాయి. ఈ నేపధ్యంలోనే సినిమాపై రోజుకో ఆసక్తికర వార్త టాలీవుడ్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతుంది.

తాజాగా ఈ సినిమాలో చరణ్ కోసం శంకర్ పవర్ ఫుల్ క్యారెక్టరైజేషన్ సెట్ చేసినట్టు తెలుస్తుంది. ఈ సినిమాలో చరణ్ మొదట కలెక్టర్ పాత్రలో, ఆ తర్వాత సీఎంగా మారి వ్యవస్థలోని లోపాలను ఎలా సరిచేస్తాడన్న దానిని తనదైన శైలిలో అద్బుతంగా చూపించడానికి శంకర్ పూనుకున్నాడట. ఇదే కాకుండా ఈ సినిమాలో మరో ముఖ్యమైన పాత్ర కోసం మెగస్టార్ చిరంజీవిని ఒప్పించే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయని టాక్ వినిపిస్తుంది.

సంబంధిత సమాచారం :