“భోళా శంకర్” పై మరో రూమర్.!

Published on Feb 21, 2023 1:00 pm IST

మెగాస్టార్ చిరంజీవి హీరోగా తమన్నా హీరోయిన్ గా దర్శకుడు మెహర్ రమేష్ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ చిత్రం “భోళా శంకర్” కోసం తెలిసిందదే. మరి ఈ సినిమాని మేకర్స్ అజిత్ వేదాళం కి రీమేక్ గా తెరకెక్కిస్తుండగా భారీ సెట్స్ లో అయితే ఈ సినిమా షూట్ ఇప్పుడు కొనసాగుతుంది. అయితే ఈ సినిమా షూటింగ్ ని మేకర్స్ అయితే ఫుల్ స్వింగ్ లో కంటిన్యూ అవుతుండగా ఈ సినిమాపై ఈ రెండు రోజుల్లో ఇంట్రెస్టింగ్ రూమర్స్ కొన్ని బయటకి వచ్చాయి.

అయితే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కి సంబంధించి పలు రిఫరెన్స్ లు ఉంటాయని చిరు కూడా పవన్ ఫ్యాన్ రోల్ లాంటిది చేస్తున్నారని పలు రూమర్స్ ఉన్నాయి. ఇక దీనితో పాటుగా తాజాగా అయితే పవన్ ఖుషి లో ఓ సీన్ ని కూడా ఈ సినిమాలో మంచి పేరడీ గా ప్లాన్ చేస్తున్నారని మరో ఇంట్రెస్టింగ్ రూమర్ ఇప్పుడు మొదలైంది. దీనితో సినీ వర్గాల్లో ఈ మరోసారి ఎగ్జైటింగ్ గా మారింది. ఇక ఈ సినిమాకి మహతి సాగర్ సంగీతం అందిస్తుండగా ఏకే ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :