నిఖిల్ నుంచి మరో ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ అనౌన్స్మెంట్.!

Published on Aug 15, 2021 11:18 am IST


మన టాలీవుడ్ లో ఉన్నటువంటి యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోల్లో తమ సినిమాలకంటూ సెపరేట్ ట్రాక్ ని ఏర్పర్చుకున్న హీరో నిఖిల్ సిద్ధార్థ్. రొటీన్ సినిమాల నుంచి బ్రేక్ తీసుకొని పలు ఆసక్తికర సినిమా చేయడం స్టార్ట్ చేసాక నిఖిల్ కి స్పెష మార్కెట్ ఏర్పడింది. అలా ఇప్పుడు పలు ఆసక్తికర సినిమాలు చేస్తున్న నిఖిల్ నుంచి ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ అనౌన్స్ కాబడింది.

‘హిట్’, ‘ఎవరు’ లాంటి థ్రిల్లర్ సినిమాలకు వర్క్ చేసిన ఎడిటర్ గ్యారీ బి హెచ్ డైరెక్టర్ గా నిఖిల్ తో ఓ సినిమాను ఇప్పుడు 75వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మేకర్స్ అనౌన్స్ చేశారు. దీనిని ఒక స్పై థ్రిల్లర్ గా భారీ లెవెల్లో ప్లాన్ చేస్తున్నట్టు తెలుపుతున్నారు. మరి ఈ చిత్రాన్ని రెడ్ సినిమాస్ బ్యానర్ పై కే రాజా శేఖర్ రెడ్డి నిర్మాణం వహించనుండగా సినిమా ఇతర క్యాస్టింగ్ మరియు మిగతా టెక్నీకల్ టీం వివరాలు త్వరలోనే రానున్నాయి.

సంబంధిత సమాచారం :