‘నిశ్శబ్దం, అశ్వద్దామ’తో పాటు మరొక సినిమా

Published on Jan 1, 2020 10:14 pm IST

నిర్మాత రాజ్ కందుకూరి కుమారుడు శివ కందుకూరి హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘చూసీ చూడంగానే’. శేషా సింధూరావ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం అన్ని పనులు ముగించుకుని విడుదలకు సిద్ధమైంది. ముందుగా డిసెంబర్ నెలాఖరున సినిమాను విడుదల చేయాలని అనుకున్న నిర్మాతలు తేదీని మార్చుకున్నారు. జనవరి 31న విడుదల చేస్తున్నట్టు కొద్దిసేపటి క్రితమే ప్రకటించారు.

అయితే జనవరి 31న మరో రెండు సినిమాలు విడుదలవుతున్నాయి. వాటిలో అనుష్క నటించిన ‘నిశ్శబ్దం’ ఒకటి కాగా మరొకటి నాగశౌర్య కథానాయకుడిగా నటించిన ‘అశ్వద్దామ’. ఈ రెండు సినిమాలపై మంచి బజ్ ఉంది ప్రేక్షకుల్లో. వీటి మధ్యన విడుదలవుతోంది కాబట్టి ‘చూసీ చూడంగానే’ చిత్రానికి పొటీ కాస్త గట్టిగానే ఉండే అవకాశం ఉంది.

సంబంధిత సమాచారం :