మరో భారీ మల్టీస్టార‌ర్‌కు రంగం సిద్ధం

మరో భారీ మల్టీస్టార‌ర్‌కు రంగం సిద్ధం

Published on Mar 26, 2015 2:18 PM IST

rana-venkatesh
ఈమధ్య కాలంలో తెలుగులో మల్టీస్టారర్ల హవా ఎక్కువైంది. ఒకప్పటి ఈ క్రేజీ మల్టీస్టారర్లు కొన్నాళ్ళ వరకూ తగ్గిపోయాయి. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టుతో మళ్ళీ ఊపందుకున్న ఈ ట్రెండ్.. ఆ తర్వాత వరుస సినిమాలతో కొనసాగుతోంది. తాజాగా ఈ మల్టీస్టారర్ జాబితాలోకి మరో భారీ సినిమా వచ్చిపడనుంది. వెంకటేష్, రానాల కలయికలో ఓ సినిమా రూపొందనుందని సమాచారం. ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సురేష్ బాబు నిర్మించనున్నారని తెలుస్తోంది.

ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తుల కలయికలో ఇలా ఓ సినిమా రూపొందనుండడం విశేషమే. ఈ సినిమాకి సంబంధించి ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందని తెలుస్తోంది. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఇక ఈ మధ్య కాలంలో ప్రచారంలోకి వచ్చిన మహేష్ – మోహన్ లాల్ సినిమా, బాలకృష్ణ-కళ్యాణ్ రామ్ సినిమా, ఇప్పుడీ సినిమా ఇవన్నీ తెరకెక్కితే అభిమానులకు పండగే!

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు