పవన్ – క్రిష్ ల ప్రాజెక్ట్ రేస్ లోకి లేటెస్ట్ టైటిల్.!

Published on Sep 22, 2020 11:05 am IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లో చేసిన డైరెక్ట్ చిత్రాల్లో మంచి మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో విలక్షణ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తో చేస్తున్న పీరియాడిక్ చిత్రం కూడా ఒకటి. ముఖ్యంగా ఇప్పుడు చేస్తున్న ప్రాజెక్టులలో అయితే ఈ చిత్రమే మోస్ట్ అవైటెడ్ అని చెప్పాలి. పవన్ ఇది వరకు టచ్ చెయ్యని జానర్ కావడం అందులోనూ దర్శకుడు క్రిష్ కావడంతో మరిన్ని అంచనాలు నెలకొన్నాయి.

అయితే ఈ చిత్రానికి ఇప్పటికే పలు టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయి. “బందిపోటు”, “విరూపాక్ష”, “గజదొంగ” లేటెస్ట్ గా “ఓం శివమ్” పేర్లు రేస్ లోకి వచ్చాయి. మరి ఈసారి మరో టైటిల్ వచ్చింది. అదే “అంతర్వాహిని”. ఈ చిత్రానికి మాటలు అందిస్తున్న సాయి మాధవ్ బుఱ్ఱా కొన్ని అద్భుతమైన వాఖ్యలతో అంతర్వాహిని పేరిట తెలిపారు. ఇపుడు అదే హెడ్ లైన్ క్రిష్ కూడా హైలైట్ చెయ్యడం ఆసక్తికరంగా మారింది. దీనితో ఈ చిత్రానికి ఈ టైటిల్ ను పెట్టారా అన్న చర్చ మొదలయ్యిపోయింది. మరి క్రిష్ ఏ టైటిల్ ను ఫిక్స్ చేసారో చూడాలి.

సంబంధిత సమాచారం :

More