బాలయ్య – బోయపాటి చిత్రంలో మరో ప్రముఖ హీరోయిన్!

Published on Nov 10, 2020 10:51 am IST

నందమూరి నట సింహం నందమూరి బాలకృష్ణ హీరోగా తన ఆల్ టైం బ్లాక్ బస్టర్ దర్శకుడు బోయపాటి శ్రీనుతో ఇప్పుడు తన హ్యాట్రిక్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. పక్కా మాస్ ఎంటర్టైనర్ గా ప్లాన్ చేస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు కూడా నెలకొన్నాయి. ఆ మధ్య వచ్చిన టీజర్ తో అయితే ఆ అంచనాలు మరింత స్థాయిలో పెరిగిపోయాయి.

అయితే ఈ చిత్రంలో ఒక మహిళా ప్రాధాన్యం ఉన్న కీలక పాత్రకు గాను ఈ మధ్యనే టాలెంటెడ్ హీరోయిన్ పూర్ణను మేకర్స్ ఎంపిక చేసుకున్న సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడు లేటెస్ట్ టాక్ ప్రకారం మరో గ్లామరస్ హీరోయిన్ ను ఎంపిక చేసినట్టు తెలుస్తుంది. ఆమెనే సయ్యేసా సైగల్.

ఇప్పటికే మన తెలుగులో “అఖిల్” చిత్రంతో అలరించిన ఈ హీరోయిన్ ను బోయపాటి ఈ చిత్రానికి ఎంపిక చేసారు. ప్రస్తుతానికి అయితే ఈమెకు తెలుగులో పెద్దగా సినిమాలు ఏమీ చెయ్యలేదు. మరి ఈ చిత్రం ఎంతమేర తనకు ప్లస్ అవుతుందో చూడాలి. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :