తారక్, మహేష్ లపై ఇంకో స్పెషల్ ట్రీట్.?

Published on Nov 30, 2021 11:00 am IST

తెలుగు స్మాల్ స్క్రీన్ పై ఆడియెన్స్ రీసెంట్ గా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న బిగ్గెస్ట్ ఎపిసోడ్ “ఎవరు మీలో కోటీశ్వరులు” నుంచి రాబోతుంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎంతో అద్భుతంగా హోస్ట్ చేస్తూ కొనసాగిస్తున్న ఈ గ్రాండ్ షో లో సూపర్ స్టార్ మహేష్ బాబు గెస్ట్ గా వచ్చిన సూపర్ స్పెషల్ ఎపిసోడ్ పై భారీ అంచనాలు ఉన్నాయి.

ఎప్పుడో షూటింగ్ కంప్లీట్ అయ్యిన ఈ ఎపిసోడ్ ఎట్టకేలకు టెలికాస్ట్ ని సిద్ధం అవుతున్నట్టు ఓ కొత్త ప్రోమోని మేకర్స్ రిలీజ్ చెయ్యగా దానికి సాలిడ్ రెస్పాన్స్ వచ్చింది. మరి ఇప్పుడు ఈ ట్రీట్ డబుల్ కాబోతుందట. లేటెస్ట్ టాక్ ప్రకారం వీరిపై ఇంకో ఆసక్తికర ప్రోమో కట్ రాబోతుందట. మరి దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది. అలాగే దానితో పాటు ఈ బిగ్ ఎపిసోడ్ టెలికాస్ట్ డేట్ కూడా రావొచ్చని తెలుస్తుంది. మరి వేచి చూడాలి ఏమవుతుందో.

సంబంధిత సమాచారం :