టాక్..విజయ్ – లోకేష్ నెక్స్ట్ సినిమాలో మరో స్టార్ హీరో..?

Published on Jun 11, 2022 1:01 pm IST


ఇళయ థలపతి విజయ్ జోసెఫ్ హీరోగా ప్రస్తుతం దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెలుగు మరియు తమిళ భాషల్లో ఒకేసారి ఏకకాలంలో సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అలాగే రష్మికా మందన్నా ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుంది. అయితే ఇదిలా ఉండగా ఈ చిత్రం తర్వాత విజయ్ హీరోగా మళ్ళీ దర్శకుడు లోకేష్ కనగ్ రాజ్ తో “మాస్టర్” తర్వాత చేయబోతున్నాడు.

ఈ విషయం ఆల్రెడీ కన్ఫర్మ్ అయ్యిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ సినిమాపై లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ టాక్ వినిపిస్తుంది. దీని ప్రకారం అయితే విజయ్ తో పాటుగా మరో స్టార్ హీరో కూడా కనిపిస్తాడని తెలుస్తుంది. ఆ హీరో మరెవరో కాదు ధనుష్ అట. ధనుష్ కి కూడా ఈ సినిమాలో కీలక పాత్ర ఉంది అని కోలీవుడ్ సినీ వర్గాలు చెబుతున్నాయి. అలాగే దీనికి మరో సినిమాకి కూడా లింక్ ఉండే విధంగానే డిజైన్ చేస్తాడనీ బజ్ ఉంది. మరి మొత్తానికి అయితే ఈ సినిమాపై మరింత సమాచారం రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :