“ఆదిపురుష్” కోసం మరో స్టార్ హీరోయిన్ పేరు.?

Published on Aug 26, 2020 11:08 am IST

ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రిస్టేజియస్ ప్రాజెక్టులలో “ఆదిపురుష్” కూడా ఒకటి. బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ ఓం రౌత్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంకు సంబంధించి ఎన్నో విశేషాలు ఉన్నాయి. అలాగే అందుకు తగ్గట్టుగానే ఈ భారీ చిత్రానికి సంబంధించి కూడా ప్రతీ రోజు కూడా ఏదొక సరికొత్త బజ్ వినిపిస్తూనే ఉంది.

3డి టెక్నాలజీలో తెరకెక్కనున్న ఈ ఎపిక్ వండర్ లో ప్రభాస్ శ్రీరామునిగా కనిపించనున్నాడని సంగతి తెలిసిందే. మరి ప్రభాస్ ఆ పాత్రకు సెట్టయ్యినట్టు సీతగా కూడా ఎవరొకరు కనిపించి చక్కగా కుదరాలి కదా? అలా మొదట్లో ఈ చిత్రానికి గాను అభినయ నటి కీర్తి సురేష్ పేరు గట్టిగా వినిపించగా..

ఇప్పుడు మరో స్టార్ హీరోయిన్ పేరు అందుకు వినిపిస్తుంది. అది మరెవరో కాదు అటు బాలీవుడ్ మరియు మన తోళ్ళవూడ్ ప్రేక్షకులకు బాగా తెలిసిన హీరోయిన్ కియారా అద్వానీ. ఇప్పుడు ఈమె పేరు కూడా ఫీమేల్ లీడ్ కు వినిపిస్తుంది. మరి ఈ భారీ ప్రాజెక్టు లో హీరోయిన్ గా ఎవరు సెట్ అవుతారో చూడాలి.

సంబంధిత సమాచారం :