లేటెస్ట్..హైప్ పెంచుతున్న “మహేష్ 28” నుంచి మరో సాలిడ్ పోస్టర్.!

Published on May 31, 2023 9:08 am IST


ప్రస్తుతం మన టాలీవుడ్ నుంచి సెన్సేషనల్ హైప్ లో అయితే ఉన్న చిత్రాల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కాంబినేషన్ లో వస్తున్న క్రేజీ హ్యాట్రిక్ చిత్రం కూడా ఒకటి. మరి దీనిపై నెక్స్ట్ లెవెల్ హైప్ ఉండగా ఇపుడు సినిమా ఫస్ట్ గ్లింప్స్ సహా టైటిల్ రివీల్ రోజు రావడంతో మహేష్ బాబు ఫ్యాన్స్ లో నెక్స్ట్ లెవెల్ ఎగ్జైట్మెంట్ అయితే నెలకొంది.

ఇక మహేష్ మాస్ స్ట్రైక్ కోసం అంతా ఎదురు చూస్తుండగా ఈ డే ని మరింత స్పెషల్ గా మారుస్తూ మేకర్స్ మరో సాలిడ్ పోస్టర్ ని రిలీజ్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేయగా ఇప్పుడు సినిమా నుంచి ఆ పోస్టర్ ని సూపర్ మహేష్ తన తండ్రి స్వర్గీయ కృష్ణ గారి జయంతి కానుకగా అయితే ఫ్యాన్స్ కి అందించారు. మరి ఈ పోస్టర్ లో మహేష్ మరింత సూపర్ మాస్ పోస్టర్ లో కనిపిస్తున్నారు.

తలకి గుడ్డ కడుతూ ఓ అదిరే ఫైట్ సీక్వెన్స్ కోసం సిద్ధం అవుతున్నట్టుగా ఈ పోస్టర్ ఆ బ్యాక్గ్రౌండ్ చూస్తే అర్ధం అవుతుంది. మరి మొత్తానికి అయితే ఈసారి మోత గట్టిగానే మోగేలా ఉందని చెప్పాలి. ఇక ఈ సినిమాలో పూజా హెగ్డే, శ్రీ లీల లు హీరోయిన్స్ గా నటిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు అలాగే హారికా హాసిని వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :