ప్రస్తుతం మన టాలీవుడ్ దగ్గర ఉన్న స్టార్ హీరోస్ లో పాన్ ఇండియా లెవెల్లో అదరగొడుతున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఒకరు. మరి అల్లు అర్జున్ అయితే తన పుష్ప సినిమా తో పాన్ ఇండియా లెవెల్లో తన స్టార్డం ప్రూవ్ చేసుకోగా ఇప్పుడు పార్ట్ 2 తో సిద్ధం అవుతున్నాడు. ఇక అంతే కాకుండా నెక్స్ట్ అయితే బన్నీ సెన్సేషనల్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ తో ఓ భారీ పాన్ ఇండియా సినిమా నిన్న అనౌన్స్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే.
ఇక ఈ సినిమాపై కూడా నెక్స్ట్ లెవెల్ హైప్ నెలకొంది. మరి ఈ ప్రాజెక్ట్ మొదలయ్యే కన్నా ముందు ఐకాన్ స్టార్ లైనప్ లో మరో ఇద్దరు దర్శకులు ఉన్నట్లు తెలుస్తోంది. మరి వారైతే దర్శకుడు త్రివిక్రమ్ మరియు సురేందర్ రెడ్డి అన్నట్లు గా ఇప్పుడు టాక్. ఈ ఇద్దరిలో అయితే పుష్ప తర్వాత బన్నీ నెక్స్ట్ ప్రాజెక్ట్ ని టేకప్ చేయనున్నారని తెలుస్తోంది. మరి దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది.


