మరొక ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ తో వస్తున్న ఆహా వీడియో!

Published on Aug 2, 2021 12:00 am IST


ఓటిటి ప్లాట్ ఫామ్స్ ఇప్పుడు ప్రేక్షకులకు అందుబాటులోకి రావడం తో థియేటర్ తరహా ఎంటర్ టైన్మెంట్ ను అందిస్తున్నాయి. సినిమాల తో పాటుగా, వెబ్ సిరీస్ లు సైతం ఓటిటి ద్వారా ప్రేక్షకులకు అందుబాటులోకి రావడం తో వీటికి డిమాండ్ మరింత గా పెరిగింది అని చెప్పాలి. అయితే ఆహా వీడియో తెలుగు ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చినప్పటి నుండి కొత్త సినిమాల తో, వెబ్ సిరీస్ లతో అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటుంది.

అయితే ఆహా వీడియో ఇప్పుడు సరికొత్తగా మరొక వెబ్ సిరీస్ ను తెలుగు ప్రేక్షకులకు అందించేందుకు సిద్దం అయ్యింది. హర్షిత్ రెడ్డి మరియు పాయల్ రాధాకృష్ణ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న తాజా వెబ్ సిరీస్ తరగతి గది దాటి. ఈ వెబ్ సిరీస్ ను ప్రకటించినప్పటి నుండి దీని పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ వెబ్ సిరీస్ ఒరిజినల్ ఫ్లేంస్ కి రీమేక్ అవ్వడం తో సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే ఈ వెబ్ సిరీస్ కి మాలిక్ రామ్ దర్శకత్వం వహించనున్నారు. అయితే ఈ వెబ్ సిరీస్ ఆగస్ట్ నెలలో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఆహా వీడియో సన్నాహాలు చేస్తుంది.

సంబంధిత సమాచారం :