నందమూరి బాలకృష్ణ ప్రతిష్టాత్మకంగా క్రిష్ దర్శకత్వంలో నిర్మిస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ చిత్రంలో రానా ఆంధ్రప్రేదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడుగారి పాత్రలో నటించబోతున్న విషయం తెలిసిందే. అయితే చంద్రబాబు నాయుడుగారి సతీమణి నారా భువనేశ్వరీగారి పాత్ర కొరకు తమిళ హీరోయిన్ మంజిమా మోహన్ ను చిత్రబృందం ఇప్పటికే సెలెక్ట్ చేసింది.
తాజాగా సినీవర్గాల సమాచారం ప్రకారం వచ్చేవారం హబిడ్స్ లోని ఎన్టీఆర్ హౌస్ లో జరగబోయే షెడ్యూల్ లో మంజిమా పాల్గొనబోతుందని తెలుస్తోంది. కాగా నాగ చైతన్య సరసన గౌతమ్ మీనన్ దర్శకత్వంలో సాహాసం శ్వాసగా సాగిపో చిత్రంతో మంజిమా మోహన్ తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. నారా భువనేశ్వరీగారి పాత్రకు మంజిమా సరైన ఎంపిక అని చిత్రబృందం భావిస్తోంది. బుర్రా సాయిమాధవ్ మాటలు అందిస్తున్న ఈ చిత్రానికి ఎం.ఎం. కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు. సాయి కొర్రపాటి, విష్ణు సహ నిర్మాతలుగా బాలకృష్ణే స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


