నాగశౌర్య సినిమాకు క్లాసికల్ టైటిల్ ?

నాగశౌర్య సినిమాకు క్లాసికల్ టైటిల్ ?

Published on Sep 21, 2019 3:00 AM IST

ప్రస్తుతం తన సొంత బ్యానర్లోనే ఒక సినిమా చేస్తున్న యువ హీరో నాగశౌర్య తాజాగా ఇంకో కొత్త సినిమాకి సైన్ చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని లక్ష్మీ సౌజన్య డైరెక్ట్ చేయనుంది. సినీ వర్గాల సమాచారం మేరకు ఈ సినిమాకు ఏఎన్నార్ క్లాసికల్ చిత్రాల్లో ఒకటైన ‘మూగ మనసులు’ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది.

టైటిల్ మాత్రమే కాకుండా సినిమా కాన్సెప్ట్ కూడా పునర్జన్మల నేపథ్యంలోనే ఉంటుందని అంటున్నారు. మరి ఈ వార్తల్లో నిజమెంత ఉందనేది చిత్ర యూనిట్ స్పందిస్తేకానీ తెలీదు. ఇకపోతే ఈ చిత్రాన్ని సితార ఎంటెర్టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్ర షూట్ అక్టోబర్ నుండి మొదలుకానుండగా 2020 మే నెలలో విడుదలను ప్లాన్ చేస్తున్నారు నిర్మాతలు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు