ఆ పాత్రలకు సూట్ కానంటున్న క్యూట్ హీరోయిన్

Published on Nov 14, 2019 3:00 am IST

మలయాళ కుట్టి అనుపమ పరమేశ్వరన్ టాలీవుడ్ లో చేసింది తక్కువ సినిమాలే అయినా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆమె నటించిన అ..ఆ, ప్రేమమ్, శతమానం భవతి చిత్రాలు సూపర్ హిట్స్ గా నిలిచాయి. ఇక బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ రాక్షసుడులో టీచర్ పాత్ర చేసిన అనుపమ మరో హిట్ తన ఖాతాలో వేసుకుంది. కెరీర్ ప్రారంభం నుండి గ్లామర్ రోల్స్ కి చాలా దూరంగా ఉంటుంది అనుపమ.

ఆమె పొట్టిబట్టలేసుకుని నటించిన దాఖలాలే లేవు. ఈ విషయం పై అనుపమాను అడుగగా గ్లామర్ రోల్స్ నాకు అసలు సూట్ కావు అన్నారు. పొట్టిబట్టలో నటించడం నాకు ఇష్టం ఉండదు. అలాగే నేను సినిమా కోసం తప్ప, మిగతా సమయాలలో మేకప్ కూడా వేసుకోను. సహజంగా ఉండటానికి ఇష్టపడతాను అని చెప్పారు. తెలుగులో అనుపమ కి అవకాశాలు తగ్గిపోయాయనే చెప్పాలి. సినిమా అంటేనే గ్లామర్ ప్రపంచం, నేను ఇలాగే ఉంటాను అని మడికట్టుకు కూర్చుంటే అసలుకే మోసం వస్తుంది.

సంబంధిత సమాచారం :

More