జగన్ బయోపిక్ పై బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంచలన ట్వీట్

Published on May 27, 2019 8:38 am IST

జగన్ 2019 సార్వత్రిక ఎన్నికలలో 151 అసెంబ్లీ సీట్లను గెలుపొంది చిరస్మరణీయ విజయాన్ని నమోదు చేసారు. ఈ విజయం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనమైంది. పాత్రికేయుడైన డి పి సతీష్ జగన్ చారిత్రాత్మక విజయంపై ఓ ఇంగ్లీష్ పత్రిక కోసం ప్రత్యేక కథనాన్ని రాయడం జరిగింది. “సోనియా జగన్ కుటుంబానికి చేసిన అవమానం, రెడ్డి ప్రతీకారం, ఆంధ్ర శాపం, కల్పిత కథను మించినది జగన్ ప్రస్థానం” అనే కోణంలో ఆయన రాసిన కథనం సంచలం రేపింది.

ఈ కథనం హెడ్డింగ్ ని ప్రియా రమణి అనే ఓ మహిళా జర్నలిస్ట్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేయగా, ఈ ట్వీట్ కి ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ స్పందించారు. “జగన్ జీవితంపై తెరకెక్కే ఈ సంచలన మూవీ త్వరలో చిత్రీకరణ మొదలుకావచ్చు అంటూ”, ట్వీట్ చేశారు. ఇదే కనుక జరిగితే చరిత్రాత్మకమైన జగన్ రాజకీయ ప్రస్థానాన్ని, దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలకు పరిచయం చేసినట్లవుతుది. ఇప్పటికే “యాత్ర” డైరెక్టర్ మహి రాఘవ “యాత్ర” 2 పేరు తో జగన్ పాదయాత్ర పై మూవీని తెరకెక్కించడానికి ఆసక్తి కనబరిచారు.

సంబంధిత సమాచారం :

More