ఆ భారీ మల్టీస్టారర్ లో అనుష్క కూడానా… ?

Published on May 29, 2019 12:00 am IST

సౌత్ ఇండ్రస్ట్రీ లోని ప్రముఖ నటులతో దర్శకుడు మణిరత్నం ఓ భారీ మల్టీస్టారర్ మూవీని నిర్మిస్తున్నారన్న విషయం తెలిసిందే. ఐతే ఈ ప్రాజెక్ట్ ఓ పుకారు అనుకుంటున్న తరుణంలో ఐశ్వర్య రాయ్ నిజమేననంటూ నిర్ధారించడంతో జనాల్లో ఈ మూవీపై ఆసక్తి ఒక్కసారిగా రెట్టింపయ్యింది.

ఐతే మరో క్రేజీ న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది.లేడి సూపర్ స్టార్ అనుష్క కూడా ఈ చిత్రంలో ఓ పాత్ర చేయనున్నారట. ఈ విషయంపై ఎటువంటి అధికారిక ప్రకటన లేనప్పటికీ తమిళ మీడియా లో వస్తున్న వార్తల ప్రకారం అనుష్క ఈ మూవీలో చేయడానికి ఒప్పుకున్నారని, అగ్రిమెంట్ పై సంతకాలు చేయడమే మిగిలివుందని సమాచారం.

ప్రస్తుతం అనుష్క “సైలెన్స్” మూవీ షూటింగ్ కొరకు ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. విక్రమ్,కార్తీ,మోహన్ బాబు,సత్య రాజ్,జయం రవి వంటి భారీ తారాగణం ఈ మూవీలో నటించనున్నారు.

సంబంధిత సమాచారం :

More