కోలీవుడ్ లో క్రేజీ ఆఫర్ దక్కించుకున్న అనుష్క?

Published on Jul 14, 2020 6:06 pm IST


స్వీటీ అనుష్క శెట్టి తమిళంలో ఓ క్రేజీ ప్రాజెక్ట్ లో నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆమెకు కమల్ హాసన్ పక్కన నటించే అవకాశం దక్కిందట. టాలెంటెడ్ డైరెక్టర్ గౌతమ్ మీనన్ వేట్టైయాడు వేళైయాడు 2 కోసం హీరోయిన్ గా అనుష్కను తీసుకోనున్నారని సమాచారం. 2006లో విడుదలైన ఈ క్రైమ్ థ్రిల్లర్ మంచి విజయాన్ని అందుకుంది. తెలుగులో ఈ చిత్రం రాఘవన్ పేరుతో విడుదలైంది.

ఈ చిత్రానికి సీక్వెల్ ప్లాన్ చేస్తున్న గౌతమ్ మీనన్ కమల్ కి జంటగా అనుష్కను తీసుకోనున్నారని వార్తలు వస్తున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సివుంది. ఇక అనుష్క నటించిన నిశ్శబ్దం మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది.క్రైమ్ అండ్ హారర్ థ్రిల్లర్ గా తెరకెక్కిన నిశ్శబ్దం మూవీలో అనుష్క మూగదైన పెయింటర్ రోల్ చేసింది.

సంబంధిత సమాచారం :

More