
ప్రముఖ నిర్మాణ సంస్థ పివిపి సినిమాస్ పతాకంపై అనుష్క ప్రధాన పాత్రలో నటించబోయే భారి బడ్జెట్ సినిమా నేడు పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. దర్శ కేంద్రుడు కె.రాఘవేంద్రరావు తనయుడు, ‘అనగనగా ధీరుడు’ సినిమా దర్శకుడు ప్రకాష్ కోవెలమూడి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తారు. యం.యం.కీరవాణి సంగీత దర్శకుడు. ప్రసాద్ వి పోట్లురి నిర్మాత.
‘బాహుబలి’, ‘రుద్రమదేవి’ సినిమాల తర్వాత అనుష్క నటిస్తున్న మరో భారి బడ్జెట్ ఫాంటసీ సినిమా ఇది . యూనిట్ వర్గాల సమాచారం ప్రకారం ప్రముఖ నవల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. కథ, కథనాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయని సమాచారం. వచ్చే నెలలో రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని సమాచారం. త్వరలో ఇతర వివరాలు వెల్లడించనున్నారు.