ఆలస్యానికి గల అసలు కారణం చెప్పిన అనుష్క.

Published on Aug 1, 2019 11:10 pm IST

స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ నటించిన “జీరో” చిత్రం విడుదలై దాదాపు ఎనిమిది నెలలు కావస్తుంది,కానీ ఆమె మరో కొత్త ప్రాజెక్ట్ పై సైన్ చేయలేదు. దీనితో ఆమె గర్భం దాల్చారని,అందుకే సినిమాలు ఒప్పుకోవడం లేదని అనేక పుకార్లు రేగాయి. ఈ నేపథ్యంలో అనుష్క ఈ విషయంపై స్పందించారు. తాను కొత్త సినిమాలు ఒప్పుకోకపోవడం వెనుక గల కారణం చెప్పారు.

విరాట్ ని పెళ్లి చేసుకున్న వెంటనే “సుయ్ ధాగా” మరియు “జీరో” చిత్రాల షూటింగ్ లో పాల్గొనాల్సివచ్చిది. దీనితో విరాట్ తో ఎక్కువ సమయం గడపడానికి సమయం దొరకలేదు. తీరిక లేకుండా ఎవరి ప్రొఫెషన్ లో వారు బిజీగా ఉండటం వలన ఆహ్లదకరంగా కొంచెం సమయం ఇద్దరికోసం కేటాయించ లేకపోతున్నాము. అందుకే అలోచించి కొద్దిరోజులు షూటింగ్ కి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను అన్నారు. మైదానంలో దూకుడుగా ఉండే విరాట్ బయట మాత్రం చాలా సున్నితంగా ఉంటారని చెప్పింది.

ఇంగ్లాండ్ లో జరిగిన వరల్డ్ కప్ తరువాత దొరికిన విరామంలో ఈ జంట కొద్దిరోజులు అక్కడ వెకేషన్ జరుపుకొని వచ్చారు.

సంబంధిత సమాచారం :