ఈసారి కూడ అనుష్క వాటి జోలికి వెళ్లట్లేదు

Published on Jan 14, 2021 12:23 am IST


‘బాహుబలి’ సిరీస్ తర్వాత అనుష్క సినిమాల కౌంట్ తగ్గించిన సంగతి తెలిసిందే. ఇంతకుముందులా కమర్షియల్ సినిమాలు జోలికి పోకుండా లేడీ ఓరియెంటెడ్ సినిమాలకే సైన్ చేస్తోంది. 2018లో ‘భాగమతి’తో పలకరించి మంచి విజయాన్ని అందుకున్న ఆమె ఆతర్వాత రెండేళ్లకు ‘నిశ్శబ్దం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఓటీటీ ద్వారా రిలీజైన ఈ సినిమా ఆశించిన విజయాన్ని దక్కించుకోలేకపోయింది. అయినప్పటికీ అనుష్క స్టార్ డమ్ తగ్గలేదు. ఆమెతో సినిమాలు చేయడానికి చాలామంది దర్శకులు, నిర్మాతలు సిద్ధంగా ఉన్నారు. అంత డిమాండ్ ఉన్నప్పటికీ చిన్నపాటి బ్రేక్ తీసుకుంది స్వీటీ.

అయితే తాజా సమాచారం మేరకు ప్రస్తుతం ఆమె కొత్త సినిమాను మొదలుపెట్టే పనిలో ఉన్నట్టు తెలుస్తోంది. అది కూడ లేడీ ఓరియెంటెడ్ సినిమానే. ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ సినిమాను నిర్మించనుందట. కొత్త దర్శకుడితో ఈ సినిమా ఉంటుందని అంటున్నారు . మరి ఆ చిత్రం ఏంటి, డైరెక్టర్ ఎవరు, ఎప్పుడు మొదలవుతుంది అనే వివరాలు తెలియాలంటే ఇంకొంత కాలం ఆగాల్సిందే. మొత్తానికి అనుష్క పూర్తిగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలకే పరిమితమైందనే సంగతి మాత్రం స్పష్టంగా తెలుస్తోంది.

సంబంధిత సమాచారం :

More