సూర్యకు జోడీగా అనుష్క

Published on Nov 19, 2019 2:00 am IST

హీరో సూర్య, గౌతమ్ మీనన్ కలిసి త్వరలో ఒక ప్రాజెక్ట్ చేయనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికైతే ప్రాజెక్ట్ మీద కన్ఫర్మేషన్ బయటకు రాలేదు కానీ సినిమా అయితే ఖాయమని తెలుస్తోంది. తాజా సమాచారం మేరకు ఈ చిత్రంలో సూర్యకు జోడీగా స్టార్ హీరోయిన్ అనుష్క నటించే అవకాశం ఉందట. అనుష్క, సూర్యలది హిట్ కాంబినేషన్. గతంలో వీరు ‘సింగం’ సిరీస్ ద్వారా అలరించారు.

ప్రేక్షకుల్లో సైతం వీరి జోడీకి మంచి క్రేజ్ ఉంది. అందుకే అనుష్కను తీసుకోవాలని నిర్మాతలు భావిస్తున్నారట. వెల్స్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. ఇకపోతే సూర్య ప్రజెంట్ ‘సూరరై పొట్రు’ అనే చిత్రం చేస్తుండగా అనుష్క ‘నిశ్శబ్ధం’ ప్రాజెక్ట్ చేస్తోంది. అలాగే గౌతమ్ మీనన్ డైరెక్ట్ చేసిన ‘ధృవ నట్చత్తిరం, ఎనై నొక్కి పాయుమ్ తోట’ చిత్రాలు విడుదలకు సిద్దమవుతున్నాయి. ఈ ప్రాజెక్ట్స్ అన్నీ ఒక కొలిక్కి రాగానే కొత్త సినిమా మొదలయ్యే అవకాలున్నాయి.

సంబంధిత సమాచారం :

More