తెలుగు లో స్టార్ హీరోయిన్ తో నెట్రికన్ రీమేక్?

Published on Aug 17, 2021 12:00 am IST

లేడీ సూపర్ స్టార్ నయనతార నటించిన నెట్రికన్ చిత్రం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో తాజాగా విడుదల అయిన సంగతి అందరికి తెలిసిందే. కళ్ళు లేని అమ్మాయి గా నయనతార నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ చిత్రం ప్రేక్షకులని విశేషంగా ఆకట్టుకుంటుంది. అయితే ఈ చిత్రాన్ని తెలుగు లో కి రీమేక్ చేసే ఆలోచన లో ఉన్నట్లు తెలుస్తోంది. అందాల తార, బాహుబలి దేవసేన అనుష్క నయనతార పాత్రలో నటించనున్నట్లు తెలుస్తుంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది. ఇప్పటి వరకూ అనుష్క నుండి కూడా ఎలాంటి అప్డేట్ రాకపోవడం తో మేకర్స్ ఇంకా ప్లానింగ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

సంబంధిత సమాచారం :