సైరా స్పెషల్ సాంగ్ లో స్టార్ హీరోయిన్ !

Published on May 5, 2019 1:00 pm IST

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 151 వ చిత్రం సైరా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. మరో షెడ్యూల్ మాత్రమే బ్యాలెన్స్ వుంది. ఇక ఈ చిత్రంలో స్టార్ హీరోయిన్ అనుష్క ఓ స్పెషల్ సాంగ్ లో చిరు తో స్టెప్పులు వేయనుందట. త్వరలోనే అనుష్క ఈ సాంగ్ షూటింగ్ లో పాల్గొననుంది. ఇక గతంలో అనుష్క , చిరు నటించిన స్టాలిన్ లో కూడా స్పెషల్ సాంగ్ లో కనిపించింది.

స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్న ఈ సైరా లో నయనతార కథానాయికగా నటిస్తుంది. అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్నాడు. కొణిదెల ప్రొడక్షన్స్ పతాకం ఫై భారీ బడ్జెట్ తో రామ్ చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.

సంబంధిత సమాచారం :

More