డిజిటల్ ప్రీమియర్ గా “నిశ్శబ్దం”కు డేట్ ఫిక్స్.!

Published on Sep 18, 2020 2:01 pm IST

మన దక్షిణాది స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి ఇప్పటి వరకు ఎన్నో లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటించిన సంగతి తెలిసిందే. అలా తాను నటించిన మరో లేటెస్ట్ చిత్రం “నిశ్శబ్దం”. ఈ చిత్రం ఇప్పటికే విడుదల కావాల్సి ఉంది కానీ లాక్ డౌన్ మూలాన ఆగిపోవాల్సి వచ్చింది. దీనితో ఆ గ్యాప్ లో ఓటిటి రిలీజ్ లు ఊపందుకోగా ఏఈ సినిమా విషయంలో పెద్ద చర్చే నడిచింది.

మొదట మేకర్స్ ఈ చిత్రాన్ని థియేటర్స్ లోనే విడుదల చేస్తామని తెలిపారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారకపోయేసరికి డిజిటిల్ రిలీజ్ కే ఒకే చేసారు. గత కొన్ని రోజుల నుంచి వినిపిస్తున్న బజ్ ప్రకారమే ఈ చిత్రం డిజిటల్ గా దిగ్గజ స్ట్రీమింగ్ యాప్ అమెజాన్ ప్రైమ్ వారు అధికారిక అప్డేట్ ను ఇచ్చేసారు.

ముందు చెప్పినట్టుగానే ఈ చిత్రం డిజిటల్ ప్రీమియర్ గా అమెజాన్ ప్రైమ్ లో వచ్చే అక్టోబర్ 2 న విడుదల కానున్నట్టుగా అనౌన్స్ చేసేసారు. అనుష్క మెయిన్ లీడ్ లో నటించిన ఈ చిత్రంలో మాధవన్, అంజలి, షాలిని పాండే తదితరులు నటిస్తుండగా హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించారు.

సంబంధిత సమాచారం :

More