స్వీటీ అనుష్క సినీప్రస్థానానికి 14 ఏళ్ళు.

Published on Jul 21, 2019 2:58 pm IST

స్వీటీ అనుష్క సినీ ప్రస్థానం మొదలై నేటికి 14 సంవత్సరాలు. డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో నాగార్జున,సోను సూద్ ప్రధానపాత్రలలో యాక్షన్ ఎంటర్టైనర్ గా విడుదలైన “సూపర్” మూవీతో అనుష్క చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యారు.ఈ చిత్రానికి యావరేజ్ టాక్ రాగా, రాజమౌళి రవి తేజా కాంబినేషన్ లో వచ్చిన “విక్రమార్కుడు” చిత్రంతో ఆమె మొదటి విజయాన్ని అందుకున్నారు. ఈ మూవీతో వచ్చిన గుర్తింపుతో అనుష్క టాలీవుడ్ లో వరుస అవకాశాలు అందుకొని విరివిగా సినిమాలు చేశారు. మెగాస్టార్ చిరంజీవి రాజకీయ ప్రస్థానానికి ముందు వచ్చిన స్టాలిన్ మూవీలో అనుష్క ప్రత్యేక గీతంలో నటించారు. అలాగే నాగార్జున నటించిన కేడి,కింగ్ చిత్రాలలో కూడా ఆమె ప్రత్యేక గీతాలలో కనిపించి అలరించారు.

కమర్షియల్ హీరోయిన్ గా కొనసాగుతున్న అనుష్క ఇమేజ్ నే మార్చేసిన చిత్రం “అరుంధతి” . మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై సీనియర్ నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి నిర్మాతగా దర్శకులు కోడి రామకృష్ణ తెరకెక్కించిన “అరుంధతి” చిత్రం 2009లో విడుదలై ఘనవిజయం సాధించింది. హారర్ మూవీలలో అరుంధతి ఓ ట్రెండ్ సెట్టర్ గా నిలిచిపోయింది. ఈ మూవీ తరువాత అనుష్క టాలీవుడ్ లో లేడీ ఓరియెంట్ చిత్రాలకు కేర్ అఫ్ అడ్రస్ గా మారిపోయింది. దాని ఫలితంగా పంచాక్షరీ,వర్ణ,రుద్రమదేవి, సైజ్ జీరో,భాగమతి వంటి లేడీ ఓరియెంట్ చిత్రాలలో అనుష్క నటించి మెప్పించారు.

ఇక “బాహుబలి” సిరీస్ లో వచ్చిన రెండు చిత్రాలలో దేవసేనగా నటించి ఆమె అంతర్జాతీయ గుర్తింపు పొందారు. మిర్చి,సింగం,బిల్లా వంటి హిట్ చిత్రాలలో గ్లామర్ హీరోయిన్ గా చేసిన అనుష్క “వేదం” వంటి సినిమాలో వేశ్యగా ఓ ఛాలెంజింగ్ రోల్ చేశారు. ప్రస్తుతం మెగాస్టార్ హీరోగా తెరకెక్కుతున్న భారీ చిత్రం “సైరా” లో ఓ కీలకపాత్ర చేస్తున్న అనుష్క,మాధవన్ హీరోగా “నిశబ్దం” అనే చిత్రంలో కూడా నటిస్తున్నారు.

ఎంత ఎదిగినా ఒదిగి ఉండే తత్వం, వివాదాలకు దూరంగా ఉండటం, అందరితో సాన్నిహిత్యంగా ఉండే అనుష్క ఇప్పటికీ టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గాక కొనసాగుతున్నారు.

సంబంధిత సమాచారం :