ప్రేక్షకులతో సినిమా చూడబోతున్న అనుష్క !

గత వారం విడుదలై మంచి విజయం సాధించింది భాగమతి సినిమా. అనుష్క నటన, తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాను నిలబెట్టాయి. దర్శకుడు అశోక్ ఈ సినిమాను తీర్చిదిద్దిన విధానం బాగుందని ప్రేక్షకులు చెబుతున్నారు. మంచి చిత్ర ఎప్పుడు వచ్చినా ప్రేక్షకులు ఆధరిస్తారని ఈ సినిమా నిరూపించింది. రెండో వారంలో కూడా కలెక్షన్స్ స్టడిగా ఉన్నాయి. విడుదలైన అన్ని చోట్ల సినిమాకు మంచి రెస్పోన్స్ లభిస్తోంది.

ఈ సినిమా సక్సెస్ టూర్ ను ప్లాన్ చేసింది చిత్ర యూనిట్. అందులో భాగంగా సోమవారం మార్నింగ్ షోను విజయవాడలోని రాజ్ థియేటర్ లో, మ్యాట్నీని ఏలూరులోని మినీ సత్యన్నారాయణ థియేటర్ లో, ఫస్ట్ షోను రాజమండ్రిలోని స్వామి థియేటర్ లో చిత్ర యూనిట్ సందర్శించనున్నారు. అంతేకాకుండా అనుష్క ఈ సినిమాను ప్రేక్షకులతో చూడబోతుండడం విశేషం.