తెలుగులో విచిత్రమైన సస్పెన్స్‌ థ్రిల్లర్‌ వెబ్ సిరీస్..!

Published on Jul 18, 2021 2:10 am IST

తెలుగులో ‘అన్యాస్‌ ట్యుటోరియల్‌’ పేరుతో ఓ విచిత్రమైన సస్పెన్స్‌ థ్రిల్లర్‌ వెబ్‌సిరీస్‌ తెరకెక్కుతోంది. ఆహా, ఆర్కా మీడియా వర్క్స్‌ సంస్థలు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సిరీస్‌లో స్టార్ హీరోయిన్ రెజీనా ప్రధాన పాత్రలో నటిస్తుండగా, పల్లవి గంగిరెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. అగస్త్య, నివేదా సతీష్‌ ఇందులో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇటీవలే ఈ సిరీస్ షూటింగ్ ప్రారంభమయ్యింది. ఈ నేపధ్యంలో నేడు మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా రెజీనా మాట్లాడుతూ ఈ కథ విన్నాక నేను తప్పకుండా ఇందులో చేయాలని నాకు అనిపించిందని చెప్పింది. ఓ లేడీ రైటర్‌ రాసిన ఈ హర్రర్ కథకు, దర్శకురాలు పల్లవి రియాలిస్టిక్‌ ఎమోషన్స్‌ జోడిస్తూ, స్క్రీన్‌ప్లే రాసుకున్న విధానం నాకు బాగా నచ్చిందని చెప్పింది. తాను మునుపెన్నడు చేయని విభిన్న పాత్ర ఇందులో పోశిస్తున్నానని మహిళా శక్తిని ప్రోత్సహిస్తూ ఈ సిరీస్‌ను నిర్మిస్తున్న ఆహా, ఆర్కా వాళ్లకు కృతజ్ఞతలు తెలియచేసింది.

నిర్మాతలు శోభు యార్లగడ్డ, అల్లు అరవింద్‌. మాట్లాడుతూ ఓ విచిత్రమైన సస్పెన్స్‌ థ్రిల్లర్‌ కథాంశంతో ప్రతిభావంతులైన మహిళా బృందంతో ఈ సిరీస్‌ చేస్తున్నామని, దీనిని ఈ ఏడాది క్రిస్మస్‌కు ‘ఆహా’లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు చెప్పుకొచ్చారు.

సంబంధిత సమాచారం :