‘కరుణామయుడు’ విజయ్‌ చందర్‌ కు కీలక పదవి !

‘కరుణామయుడు’ విజయ్‌ చందర్‌ కు కీలక పదవి !

Published on Nov 11, 2019 7:07 PM IST

సీనియర్ నటుడు ‘తెలిదేవర విజయ్‌ చందర్‌’ ముందు నుంచి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి ప్రచారం చేశారు. దాంతో ఆయనకు జగన్ కీలక పదవిని ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫిల్మ్, టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్‌ గా విజయ్‌ చందర్‌ ను నియమిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం నేడు అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు పౌరసంబంధాల శాఖ కమిషనర్ తుమ్మ విజయ్ కుమార్ రెడ్డి నియామక ఉత్తర్వులు జారీ చేశారు.

ఇక విజయచందర్ నటించిన చారిత్రాత్మకమైన కరుణామయుడు, ఆంధ్రకేసరి మొదలైన సినిమాలు తెలుగు ప్రేక్షకుల్ని అలరించాయి. ఆయన అసలు పేరు రామచందర్. 1942లో మద్రాసులో పుట్టారు. ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు ఈయనకు తాతగారు అవుతారు. విజయచందర్ తల్లి పుష్పావతి, ప్రకాశం పంతులుగారి కూతురు. తండ్రి తెలిదేవర వెంకట్రావు హోమియోపతి వైద్యుడు. బ్యాడ్మింటన్ ఛాంపియన్ కూడా. ఆరుమంది సంతానంలో విజయ చందర్ మూడోవాడు. ఈయన విద్యాభ్యాసం అంతా కాకినాడలో జరిగింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు