ఏపీ లో మళ్లీ 100 శాతం సిట్టింగ్ కెపాసిటీ తో ప్రారంభం కానున్న థియేటర్లు!

Published on Oct 12, 2021 8:13 pm IST


ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కరోనా వైరస్ పరిస్థితుల వలన 100 శాతం సిట్టింగ్ కెపాసిటీ కు అనుమతి లేదు. తాజాగా ఇందుకు సంబంధించిన ఒక విషయం పై త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.సిట్టింగ్ కెపాసిటీ పై ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పిలుపును ఇచ్చినట్లు తెలుస్తోంది.

అక్టోబర్ 14 వ తేదీ నుండి రాష్ట్ర వ్యాప్తంగా 100 శాతం సిట్టింగ్ కెపాసిటీ తో ప్రారంభం కానున్నాయి థియేటర్లు. అయితే దీని పై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఒకవేళ అదే జరిగితే ఈ పండుగ కి మహా సముద్రం మరియు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ వంటి చిత్రాలు ఉన్నాయి. ఈ సినిమాలు వరుసగా అక్టోబర్ 14 మరియు 15 న విడుదల కానున్నాయి. 100 శాతం సిట్టింగ్ కెపాసిటీ తో ప్రారంభం అయితే బాక్సాఫీస్ వద్ద ఈ రెండు సినిమాలు మంచి వసూళ్లను రాబట్టడం ఖాయం అని తెలుస్తుంది.

సంబంధిత సమాచారం :