తెలుగు రాష్ట్రాలలో మహేష్ సరిలేరు నీకెవ్వరు కలెక్షన్స్ ప్రభంజనం.

Published on Jan 16, 2020 10:42 am IST

మహేష్ సంక్రాంతి మూవీ సరిలేరు నీకెవ్వరు వసూళ్ల జోరు కొనసాగుతుంది. విడుదలైన మొదటిరోజే మహేష్ కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టిన ఈ చిత్రం తెలుగు రాష్ట్రాలలో విశేష ఆదరణ దక్కించుకుంటుంది. పండుగ సీజన్ కి వచ్చిన పర్ఫెక్ట్ మూవీగా సరిలేరు నీకెవ్వరు నిలిచింది. విడుదలైన ఐదురోజులకు కూడా అనేక చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిస్తున్నాయి . ఇక రెండు తెలుగు రాష్ట్రాలలో సరిలేరు నీకెవ్వరు వసూళ్ల వివరాలు వింటుంటే మైండ్ బ్లాక్ కావలసిందే. నైజాం లో ఈ చిత్రం ఐదురోజులకు 22.5 కోట్ల షేర్ రాబట్టింది. మరో కొద్దిరోజులలో మహేష్ కెరీర్ లో హైయెస్ట్ నైజాం కలెక్షన్స్ సాధించిన మహర్షి మూవీని దాటివేయడం ఖాయంగా కనిపిస్తుంది.

ఇక సీడెడ్ లో 9.75 కోట్లు, గుంటూరులో 7.19 కోట్లు, కృష్ణ 5.55 కోట్ల షేర్ వసూలు చేసింది. విడుదలైన ఐదురోజులోనే సరిలేరు నీకెవ్వరు 80% పెట్టుబడి రాబట్టినట్టు తెలుస్తుంది . కొన్ని ఏరియాలో సరిలేరు నీకెవ్వరు బ్రేక్ ఈవెన్ కి చేరుకుంది. దర్శకుడు అనిల్ రావిపూడి పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఈచిత్రాన్ని తెరకెక్కించారు. రష్మిక మందాన హీరోయిన్ గా నటించగా దిల్ రాజు సమర్పణలో రామ బ్రహ్మం సుంకర నిర్మించారు. దేవిశ్రీ సంగీతం అందించారు.

ప్రాంతాల వారీగా ఏపీ/తెలంగాణా కలెక్షన్స్ వివరాలు…
నైజాం – 22.5 కోట్లు
సీడెడ్ – 9.75 కోట్లు
ఉత్తరాంధ్ర – 10.05 కోట్లు
గుంటూరు – 7.19 కోట్లు
ఈస్ట్ – 6.22 కోట్లు
వెస్ట్ – 4.54 కోట్లు
కృష్ణ – 5.55 కోట్లు
నెల్లూరు – 2.42 కోట్లు

మొత్తం ఐదు రోజులకు రూ. 68.22 కోట్ల షేర్

సంబంధిత సమాచారం :

X
More