“RRR” కి హాలీవుడ్ నుంచి ఆగని ప్రశంసలు..మరో ప్రముఖ రైటర్.!

“RRR” కి హాలీవుడ్ నుంచి ఆగని ప్రశంసలు..మరో ప్రముఖ రైటర్.!

Published on Jun 14, 2022 12:00 PM IST


మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు హీరోలుగా దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన లేటెస్ట్ భారీ మల్టీ స్టారర్ చిత్రం “రౌద్రం రణం రుధిరం”. భారీ అంచనాలు నడుమ వచ్చిన ఈ చిత్రం అన్ని అంచనాలు అందుకొని తెలుగు ఇండస్ట్రీ నుంచి మరో ప్రౌడ్ ఇండియన్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అయితే ఈ చిత్రం థియేటర్స్ లో రిలీజ్ అయ్యి ఓటిటిలో వచ్చాక ముఖ్యంగా నెట్ ఫ్లిక్స్ నుంచి అయితే సెన్సేషనల్ రెస్పాన్స్ ని అందుకుంది.

అక్కడ నుంచి అనేకమంది హాలీవుడ్ ప్రముఖుల్లో అయితే నెక్స్ట్ లెవెల్ రీచ్ ని ఈ చిత్రం అందుకుంది. తాజాగా అయితే మరో హాలీవుడ్ ప్రముఖ రైటర్ ఈ సినిమా చూసి ఎంజాయ్ చేసినట్టుగా తెలిపాడు. హాలీవుడ్ లో ప్రముఖ హిట్ యానిమేషన్ క్యారెక్టర్స్ మినియన్స్ రచయిత బ్రెయిన్ లించ్ వావ్ RRR అంటూ ట్వీట్ చేయగా అది ఇప్పుడు మంచి వైరల్ గా మారింది. మొత్తానికి అయితే హాలీవుడ్ ప్రముఖులు నుంచి మాత్రం ఈ సినిమాకి ఇప్పుడప్పుడే ప్రశంసలు ఆగేలా లేవని చెప్పాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు