‘సైరా’ సినిమాకు పనిచేయబోవడంలేదన్న రెహమాన్ !
Published on Nov 26, 2017 10:09 am IST

మెగాస్టార్ చిరంజీవి ఎంతో ప్రతిష్టాత్మకంగా చేయనున్న 151వ చిత్రం ‘సైరా’ డిసెంబర్లో ప్రారంభంకానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను జాతీయస్థాయిలో నిలబెట్టేందుకు మెగా క్యాంప్ అన్ని విధాల కృషి చేస్తోంది. అందులో భాగంగానే ఆస్కార్ విజేత ఏ.ఆర్. రెహమాన్ ను ప్రాజెక్టులోకి తీసుకున్నారు. ఆయన చేరికతో సినిమా స్థాయి కూడా పెరిగింది. కానీ రెహమాన్ ఈ సినిమాను తాను చేయడంలేదని చెప్పుకొచ్చారు.

ఒక కచేరీ నిమిత్తం హైదరాబాద్ వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ చిరంజీవిగారు నా అభిమాన హీరో. ఆయన సినిమాకు పనిచేయాలని ఎన్నాళ్లగానో ఎనుకుంటున్నాను. కానీ బిజీ షెడ్యూల్ వలన ‘సైరా’ సినిమా చేయలేకపోతున్నాను. అంత మంచి ప్రాజెక్ట్ చేయలేకపోతున్నందుకు బాధపడుతున్నాను అన్నారు అన్నారు. మరి ఆయన స్థానంలో ఏ సంగీత దర్శకుడిని తీసుకుంటారో చూడాలి.

 
Like us on Facebook