ఆస్కార్ కి నామినేట్ అయిన డైరెక్టర్ తో ఎఆర్ రెహమాన్

ఆస్కార్ కి నామినేట్ అయిన డైరెక్టర్ తో ఎఆర్ రెహమాన్

Published on Feb 6, 2015 2:20 AM IST

ar-rehman
ఆస్కార్ అవార్డు మరియు గ్రామీ అవార్డ్స్ గెలుచుకున్న లెజండ్రీ మ్యూజిక్ డైరెక్టర్ ఎఆర్ రెహమాన్ ఎట్టకేలకు ‘మొహమ్మద్’ సినిమాకి మ్యూజిక్ కంపోజ్ చెయ్యడం మొదలు పెట్టాడు. ఈ సినిమాకి లెజండ్రీ ఇరానియన్ డైరెక్టర్ మజిద్ మజిద్ దర్శకత్వం వహిస్తాడు. ఈ విషయాన్ని రెహమాన్ తన ఫేస్ బుక్ ద్వారా తెలియజేయడమే కాకుండా పారిస్ లో తను మొదలు పెట్టిన రికార్డింగ్ సెషన్స్ ని సంబందించిన ఫోటోని కూడా షేర్ చేసాడు. ఈ సినిమా కోసం ఎ ఆర్ రెహమాన్ పాలస్తీనా మ్యూజిక్ డైరెక్టర్ అయిన ట్రియో లే ట్రియో జౌబ్రాన్ తో కలిసి పనిచేయనున్నాడు.

మజిద్ మజిద్ ఇరాన్ ఐ లో ఫేమస్ ఫిల్మ్ మేకర్, ఆయన ఆస్కార్ కి కూడా నామినేట్ చేయబడ్డారు. ఆయన తీసిన ‘చిల్డ్రన్ అఫ్ హెవన్’, ‘బరన్’, ‘ది కలర్ అఫ్ పారడైజ్’ సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయ్యారు. మొహమ్మద్ సినిమా మొహమ్మద్ అనే కుర్రాడి బాల్యంపై ఇస్లామిక్ ఎలా ప్రభావం చూపిందనేదే ఈ చిఎన్మా కథ. ఇరాన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే మొదటిసారిగా 35 మిలియాస్ డాలర్స్ తూ తెరకెక్కనున్న సినిమా ఇది. ఈ సినిమాకి లెజండ్రీ కెమెరామెన్ విట్టోరియో స్తోరారో సినిమాటోగ్రాఫర్ గా పనిచేయనున్నాడు.

తాజా వార్తలు