విరాగో అంటే సంస్కృతంలో మహిళా యోధురాలు అని అర్ధం. అరకు ప్రాంతానికి చెందిన ఓ యువతి, తన అక్కకు జరిగిన అన్యాయంపై చేసే పోరాటం నేపధ్యంలో రూపొందించిన ఈ చిత్రానికి అరకులో విరాగో అనే పేరు పెట్టారు దర్శకనిర్మాతలు. దర్శకుడు గిరి చిన్నా కి, నిర్మాత శ్రీమతి తోట సువర్ణ కి ఇది అరంగేట్ర చిత్రం కావడం గమనార్హం. తోట ప్రొడక్షన్స్ పతాకంపై గిరి చిన్నా దర్శకత్వంలో శ్రీమతి తోట సువర్ణ నిర్మిస్తున్న ఈ విభిన్న కథా చిత్రంలో రవీన్ ప్రగడ, పూజా చౌరాసియా హీరో హీరోయిన్ లు గా నటిస్తున్నారు. డి.ఎస్.రావు ఈ చిత్రం లో ప్రతినాయక పాత్రలో నటిస్తున్నారు. సెన్సార్ సహా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్టు 13 న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ నేపథ్యం లో నిర్మాత శ్రీమతి తోట సువర్ణ మాట్లాడుతూ, గిరి చిన్నా చెప్పిన కథ ఎంతగానో నచ్చి అతన్ని దర్శకుడిగా పరిచయం చేస్తూ, నిర్మాతగా అరంగేట్రం చేస్తున్నాను అని అన్నారు. తనకు జరిగిన అన్యాయం గురించి ఫిర్యాదు చేయడానికి పోలీసుల్ని ఆశ్రయించిన తనకు అక్కడ కూడా ఎదురైన ఆరాచకంపై ఓ ధీర వనిత తీర్చుకునే ప్రతీకారమే అరకులో విరాగో అని అన్నారు. హీరో హీరోయిన్ లుగా పరిచయమవుతున్న రవీన్ ప్రగడ, పూజా చౌరాసియా ఇద్దరూ చక్కని ప్రతిభ కనబరిచారని తెలిపారు. డి.ఎస్.రావు విలన్ గా అద్భుతంగా నటించారు అని అన్నారు. ఈనెల 13న విడుదల చేస్తున్నాం అంటూ చెప్పుకొచ్చారు. ఈ చిత్రానికి సంగీతం త్రినాథ్ మంతెన అందిస్తున్నారు.


