ఎన్టీఆర్ ఎంత గొప్ప న‌టుడో అంటున్న అక్కినేని హీరో !

Published on Oct 13, 2018 4:13 pm IST


టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన ‘అరవింద సమేత’ చిత్రం ప్రస్తుతం రికార్డుల మోత మోగిస్తోంది. టెంపర్ నుండి వరుస విజయాలతో దూసుకువెళ్తున్న ఎన్టీఆర్ గత చిత్రాల్లో కంటే, ఈ చిత్రంలో ఇంకా అద్భుతంగా నటించాడు. ముఖ్యంగా రాయలసీమ యాసలో తారక్ చెప్పిన డైలాగ్స్, ఆయన మాడ్యులేషన్ స్టైల్, ఎమోషనల్ సన్నివేశాల్లో ఆయన పలికించిన ఎక్స్ ప్రెషన్స్ సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. దాంతో సినిమా నాన్ బాహుబలి రికార్డ్ లను తిరగ రాస్తోంది. బాక్సాఫీస్ వద్ద ఎన్టీఆర్ స్టామీనా ఏంటో తెలియజేస్తోంది ఈ చిత్రం.

ఇప్పటికే కొందరు సినీ ప్రముఖులు అర‌వింద స‌మేత‌ పై, తారక్ నటన పై ప్ర‌శంస‌లు కురింపించిన విషయం తెలిసిందే. తాజాగా అక్కినేని అఖిల్ కూడా ఈ సినిమా పై తారక్ నటన పై ప్ర‌శంసించాడు. ‘ఎన్టీఆర్ ఎంత గొప్ప న‌టుడో ఈ సినిమా మ‌రోసారి గుర్తు చేస్తుంది. నిజంగా ఎన్టీఆర్ న‌ట‌న అద్భుతం. డైరెక్టర్ త్రివిక్ర‌మ్ గారికి హ్యాట్సాఫ్‌. మ్యూజిక్ డైరెక్టర్ తమ‌న్ ఈ సినిమాకు ప్రాణం పెట్టాడు. చిత్ర‌బృందానికి అభినంద‌న‌లు. ఈ విజ‌యాన్ని మనస్ఫూర్తిగా ఆస్వాదించండి అని అఖిల్ పోస్ట్ చేశాడు.

సంబంధిత సమాచారం :