అరవింద సమేత 3రోజుల కలక్షన్స్ !

Published on Oct 14, 2018 2:10 pm IST


యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ‘అరవింద సమేత వీర రాఘవ’ బాక్సాఫిస్ రికార్డులను తిరగరాస్తుంది. తెలుగురాష్ట్రల్లో ఈ చిత్రం మంచి వసూళ్లను రాబడుతుంది. ఇక ఈచిత్రానికి పోటీ కూడా లేకపోవడం మరింతగా కలిసొస్తుంది.

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈచిత్రం మూడు రోజులకుగాను రూ. 40కోట్ల ఫై చిలుకు షేర్ వసూళ్లను రాబట్టింది. ఇక నైజాం ఏరియాలో ఈచిత్రం ఇప్పటివరకు రూ. 11.16కోట్ల షేర్ ను సాధించింది. ఇక ఈరోజు సెలవు దినం కావడం వలన కలెక్షన్లకు డోకా వుండదు. త్రివిక్రమ్ తెరకెక్కించిన ఈచిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటించింది.

సంబంధిత సమాచారం :