భీం టీజర్ కు కరెక్ట్ గా సెట్టైయ్యే వీర రాఘవుడి పవర్ఫుల్ డైలాగ్!

Published on Oct 23, 2020 4:08 pm IST

నిన్న అక్టోబర్ 22 రోజును మాత్రం యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులు అంత తేలిగ్గా మర్చిపోలేరని చెప్పాలి. గత 2018లో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మరియు తారక్ ల కాంబోలో వచ్చిన మాస్ ఎంటర్టైనర్ “అరవింద సమేత” ను చూసి త్రివిక్రమ్ లో ఈ రేంజ్ మాస్ కోణం ఉందా అని అంతా ఆశ్చర్యపడ్డారు. ఇక అలాగే అక్కడ నుంచి నిన్నటికి వచ్చిన సుదీర్ఘ విరామంని ఎలా పూడ్చారు అన్నది ప్రస్తావించాలి అంటే అదే అరవింద సమేత లో త్రివిక్రమ్ రాసిన పవర్ ఫుల్ డైలాగ్స్ తోనే పూరిస్తే బాగుంటుంది అని చెప్పాలి.

ఆ చిత్రంలో ఫోన్ కాల్ వార్నింగ్ సన్నివేశంలో తారక్ మాట్లాడుతూ “ఏ పల్లెలో ఆకు అల్లాడినా ఏ చెట్టు మీద పిట్ట లేచినా అది మహానంది గారి వీర రాఘవ రెడ్డి కత్తి వాదర అలికిడే..అనే సన్నివేశం ఉంటుంది. అలాగే నవీన్ చంద్రతో మాట్లాడుతూ నల్లగుడిని నల్లమబ్బు కమ్మినట్టు కమ్మేస్తా అని మరో ఇంటెన్స్ డైలాగ్ కూడా ఉంటుంది. సరిగ్గా ఈ డైలాగ్స్ ను నిజం చేసేలానే ఇన్నేళ్ల గ్యాప్ ను ఒక్కసారిగా సోషల్ మీడియా అంతా భీం టీజర్ తో తారక్ కమ్మేసాడు.

సోషల్ మీడియా మాధ్యమాల్లో ఎటు చూసినా ఏ మీమ్ పడినా సరే భీం టీజర్ కోసమే..అంతేనా ఈ టీజర్ ను కేవలం తారక్ అభిమానులు మాత్రమే ఎంజాయ్ చేసారు అంటే పొరపాటే ప్రతీ హీరో అభిమాని కూడా రాజమౌళి అందించిన ఈ విజువల్ ను ఓ రేంజ్ లో ఎంజాయ్ చేసారు. దీనితో యూట్యూబ్ ను కూడా తారక్ నల్లమబ్బు కమ్మినట్టు కమ్మేసాడు. ఆ రేంజ్ లో భీం నిన్న మొత్తం అలా తన ప్రకంపనలు సృష్టించాడు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు తారక్ లతో రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ “రౌద్రం రణం రుధిరం” మున్ముందు ఎలాంటి వండర్స్ సృష్టిస్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం :

More