ఎం జి ఆర్ తో జయలలితను పోల్చేస్తున్నారు

Published on Jan 17, 2020 11:00 pm IST

నేడు తమిళ నాడు లెజెండరీ పర్సనాలిటీ ఎం జి రామచంద్రన్ జయంతి. భారత దేశ అత్యున్నత పురస్కారం భారత రత్న అందుకున్న ఆయన వెండి తెరపై మరియు రాజకీయాలలో ఒక అద్భుత శకాన్ని ఆవిష్కరించారు. కాగా ఆయన జయంతిని పురస్కరించుకొని జయలలిత బయోపిక్ గా తెరకెక్కుతున్న తలైవి చిత్రంలో ఎం జి ఆర్ రోల్ చేస్తున్న అరవింద స్వామి లుక్ విడుదల చేశారు. అలాగే ఓ చిన్న వీడియో కూడా విడుదల చేశారు. ఎం జి ఆర్ గా అరవింద స్వామి లుక్ సూపర్ సక్సెస్ అయ్యింది. ఎం జి ఆర్ గెటప్ లో అరవింద స్వామి అద్భుతంగా ఉన్నాడంటూ అందరూ పొగిడేస్తున్నారు.

ఐతే ఈ చిత్రంలో జయలలితగా టైటిల్ రోల్ చేస్తున్న కంగనా రనౌత్ లుక్ కి మాత్రం మిశ్రమ స్పందన వచ్చింది. బక్కపలుచగా ఉండే కంగనా పేస్ జయలలిత పేస్ కి సరిపోలేదు. ఇక నేడు అరవింద స్వామి లుక్ చూసిన వారు జయలలితగా కంగనా కంటే, ఎం జి ఆర్ గా అరవింద స్వామి బాగున్నాడంటూ పోలికలు మొదలుపెట్టారు. ఈ చిత్రాన్ని దర్శకుడు ఏ ఎల్ విజయ్ తెరకెక్కిస్తుండగా, హర్షవర్ధన్ ఇందుకూరి నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

X
More