అర‌వింద స‌మేత ఏపీ-తెలంగాణ‌ ఫ‌స్ట్‌-డే క‌లెక్ష‌న్స్‌.. తుడుచుకుపోయిన నాన్ బాహుబ‌లి రికార్డ్స్‌

Published on Oct 12, 2018 4:15 pm IST


అర‌వింద స‌మేత విడుద‌ల అయిన తొలిరోజు నుండే రికార్డుల వేట మొద‌లు పెట్టింది. త్రివిక్ర‌మ్-తార‌క్ కాంబినేష‌న్‌లో భారీ అంచ‌నాల మ‌ధ్య విడుద‌ల అయిన ఈ చిత్రం అదిరిపోయే క‌లెక్ష‌న్ల‌తో దూసుకుపోతుంది. ప్ర‌పంచ వ్యాప్తంగా బాక్సాఫీస్ వ‌ద్ద అరాచ‌కం సృష్టిస్తూ తొలిరోజు నాన్ బాహుబ‌లి రికార్డుల‌ను త‌న పేరిట లిఖించుకున్నాడు.

ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణాలో అరవింద స‌మేత తొలి రోజు షేర్లు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

ఇక ఈ చిత్రం నైజాం, గుంటూరు, సీడెడ్ ఏరియాల్లో బాహుబ‌లి చిత్రం త‌ర్వాత తొలిరోజు అత్య‌ధిక వసూళ్ళు అర‌వింద కొల్ల‌గొట్టింది. ఇక నైజాంలో గ‌తంలో ఈ తొలిరోజు నాన్‌బాహుబ‌లి రికార్డు అజ్ఞాతవాసి చిత్రం పేర‌మీద ఉంది. అజ్ఞాతవాసి తొలిరోజు అత్య‌ధికంగా 8.13 కోట్ల గ్రాస్ రాబ‌ట్టింది. అయితే అర‌వింద స‌మేత ఆ రికార్డును బీట్ చేస్తూ తొలిరోజు ఏకంగా 8.30 కోట్ల గ్రాస్ (5.73 కోట్ల షేర్) వ‌సూలు చేసి బాక్సాఫీస్ దుమ్ముదులుపుతోంది ఈ అర‌వింద స‌మేత‌. ఇక యూఎస్‌లోనూ అర‌వింద ప్ర‌భంజ‌నం కొన‌సాగుతుంది. తొలిరోజు దాదాపు $1 మిలియ‌న్ మార్కును అందుకున్న ఈ చిత్రం.. ఈ వీకెండ్ ఆదివారం నాటికి $2 మిలియ‌న్ మార్కును చేరుకోవ‌డం ఖాయ‌మ‌ని ట్రేడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఇక‌ దసరా వరకు ఎలాంటి పెద్ద సినిమాలు లేక పోవడంతో.. అర‌వింద‌ మరింత కలెక్షన్లు రాబట్టే ఛాన్స్ ఉందని సినీ విశ్లేష‌కులు అభిప్రాయ ప‌డుతున్నారు.

 

ఏరియా కలెక్షన్స్
నైజాం 5.73 కోట్లు
సీడెడ్ 5.48 కోట్లు
నెల్లూరు 1.06 కోట్లు
గుంటూరు 4.14 కోట్లు
కృష్ణ 1.97 కోట్లు
పశ్చిమ గోదావరి 2.77 కోట్లు
తూర్పు గోదావరి 2.37 కోట్లు
వైజాగ్ 8.44 కోట్లు
మొత్తం 26.64 కోట్లు

సంబంధిత సమాచారం :

More