నైజాంలో రికార్డు కలక్షన్స్ తో దూసుకుపోతున్న అరవింద సమేత !

Published on Oct 16, 2018 9:17 am IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ‘అరవింద సమేత వీర రాఘవ’ బాక్సాఫిస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. నైజాంలో దసరా సెలవులను సరిగ్గా క్యాష్ చేసుకున్న ఈచిత్రం ఇప్పటివరకు అక్కడ 15కోట్ల పైచిలుకు షేర్ వసూళ్లు సాధించింది. మరో నాలుగు కోట్ల షేర్ రాబడితే నైజాంలో ఈచిత్రం సేఫ్ అవుతుంది. ఇక సీడెడ్ లో కూడా ఈ చిత్రం మంచి వసూళ్లను రాబడుతుంది. ఇప్పటివరకు అక్కడ 10కోట్ల పైచిలుకు షేర్ వసూళ్లను రాబట్టింది.

ఇక ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 70కోట్ల షేర్ ను ఖాతాలో వేసుకుంది ఈ చిత్రం. అయితే ఈ చిత్రాన్ని అధిక రేట్లకు అమ్మడంతో భారీ లాభాలను సాధించడం కష్టమే అంటున్నాయి ట్రేడ్ వర్గాలు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన ఈచిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటించింది. హారిక హాసిని క్రీయేషన్స్ నిర్మించిన ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం :