తమన్ చేతులు మీదుగా ‘అర్థం’ ఫస్ట్‌లుక్ విడుదల..!

Published on Aug 16, 2021 10:00 pm IST

మహేంద్ర, శ్రద్ధా దాస్, అజయ్, ఆమని ప్రధాన తారగణంగా రూపొందుతున్న సైకలాజికల్ థ్రిల్లర్ ‘అర్థం’. పలు చిత్రాలకు ఎడిటర్‌గా, వీఎఫ్ఎక్స్ నిపుణుడిగా పని చేసి గుర్తింపు తెచ్చుకున్న మణికాంత్ తెల్లగూటి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని రిత్విక్ వెత్సా సమర్పణలో మినర్వ మూవీ మేకర్స్, శ్రీ వాసవి మూవీ ప్రొడక్షన్స్ పతాకాలపై రాధికా శ్రీనివాస్ నిర్మిస్తున్నారు. అయితే ఇండిపెండెన్స్ డే సందర్భంగా ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను ట్విట్టర్ ద్వారా విడుదల చేసి, చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపాడు.

ఈ సందర్భంగా నిర్మాత రాధికా శ్రీనివాస్ మాట్లాడుతూ ఫస్ట్‌లుక్ విడుదల చేసిన తమన్ గారికి కృతజ్ఞతలు తెలిపాడు. ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేసే కథాంశంతో రూపొందుతున్న సైకలాజికల్ థ్రిల్లర్ ఈ సినిమా అని, ఈ సినిమాను త్వరలోనే ఈ సినిమాను విడుదల చేస్తామని అన్నారు.

దర్శకుడు మణికాంత్ తెల్లగూటి మాట్లాడుతూ కుటుంబ విలువలను కాపాడే, మహిళా సాధికారతను పెంపొందించే సరికొత్త కథాంశంతో రూపొందుతున్న సినిమా ఇదని అన్నారు. అత్యుత్తమ నిర్మాణ విలువలతో రాధికా శ్రీనివాస్ ఈ సినిమాను నిర్మించారు. వీఎఫ్ఎక్స్‌లో నాకు అనుభవం ఉండటంతో సినిమా వీఎఫ్ఎక్స్‌ విషయంలో మరింత శ్రద్ధ వహిస్తున్నానని అన్నారు.

సంబంధిత సమాచారం :