రిలేషన్ షిప్ లో ఉన్న “బిగ్ బాస్” ఫేం అరియానా!?

Published on Jul 20, 2021 4:47 pm IST


ప్రస్తుతం యంగ్ సెలబ్రిటీ లలో బాగా వివాదాస్పదం అవుతున్న నటి అరీయానా.తను వేసే ప్రతి స్టెప్ లో కూడా బోల్డ్ అండ్ డేరింగ్ ఉండటం తో అందరినీ ఆకట్టుకుంటోంది. అయితే బిగ్ బాస్ లో సైతం తన మాట చాతుర్యం మరియు డేరింగ్ డాషింగ్ విధానం తో అందరినీ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం తనకు సంబంధించిన ఒక వార్త గత కొద్ది రోజులుగా సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది.

అరియానా ప్రస్తుతం లాంగ్ డిస్టెన్స్ రిలేషన్ షిప్ లో ఉన్నట్లు ఫిల్మ్ నగర్ లో వార్తలు వస్తున్నాయి. ఆస్ట్రేలియా లో పని చేస్తున్న ఒక ఎన్నారై తో అరియానా డేటింగ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇది ఇంకా పుకారు గానే ఉండటం తో దీని పై క్లారిటీ రావాల్సి ఉంది. అయితే ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్త సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతోంది.

సంబంధిత సమాచారం :